- Advertisement -
న్యూఢిల్లీ: భారత్, మయన్మార్ సరిహద్దుల వద్ద 16 కిలోమీటర్ల వరకు రెండు దేశాలలోకి పాస్‌పోర్టు, వీసా వంటి పత్రాలేవీ లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించే ఒప్పందాన్ని నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. మన సరిహద్దులను కాపాడుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ లక్షమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
దేశ అంతర్గత భద్రత పరిరక్షించడంతోపాటు, ఈశాన్య రాష్ట్రాల జనాభా గణాంకాలను గుర్తించేందుకు స్వేచ్ఛా సంచార ఒప్పందాన్ని సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మయన్మార్ సరిహద్దుల వెంబడి 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని భారత్ నిర్ణయించుకున్నట్లు అమిత్ షా ఇటీవలనే ప్రకటించారు. కంచె పక్కన గస్తీ మార్గాన్ని కూడా నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -