Friday, January 10, 2025

కీసర మండల సమాఖ్య సిసి, గ్రామ సంఘం విఓఎ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా: నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కీసర మండల సమాఖ్య సీసీ, గ్రామ సంఘం విఓఎలను సస్పెండ్ చేస్తూ మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి (డీఆర్‌డీఓ) పద్మజారాణి ఉత్తర్వులు జారీ చేశారు. కీసర గ్రామ పంచాయతీలోని కీసర 3 గ్రామ సంఘం విఓఎ లావణ్య తన పరిధిలోని నటరాజ్ సంఘం సభ్యుల సంతకాలు పోర్జరీ చేసి బ్యాంకు ద్వారా రూ.లక్ష డ్రా చేశారు. డ్రా చేసిన డబ్బులను సీసీ సరిత తన అవసరాల కోసం వాడుకొని తిరిగి చెల్లించారు.

ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో డీఆర్‌డీఓ పద్మజారాణి ఆదేశాల మేరకు డీపీఎం ఐబి గత నెల 28న కీసర మండల సమాఖ్యను, కీసర ఎస్‌బిఐ బ్యాంకును, కీసర గ్రామ సంఘాలను సందర్శించి విచారణ జరిపారు. విచారణలో సీసీ సరిత, విఓఎ లావణ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో వారిని విధుల నుండి సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News