Wednesday, January 22, 2025

మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను నిలిపివేత

- Advertisement -
- Advertisement -

మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ లతో మాస్టర్ ప్లాన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

రైతుల, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు చర్చించారు. కామారెడ్డి పట్టణంలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అందరి సమన్వయంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. రైతుల భూమి సేకరణ చేసే ఉద్దేశం మాస్టర్ ప్లాన్ తో లేదన్నారు. రైతుల భూములు ఎక్కడికి పోవని సూచించారు. వ్యవసాయ భూములలో కొత్త రోడ్ల నిర్మాణం రైతులకు నష్టం జరగకుండా ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను నిలిపివేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News