Wednesday, January 22, 2025

పంజాబ్‌లోని తర్న్ తరన్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ రద్దు

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: పంజాబ్ అమృత్‌సర్‌లోని మోగా, సంగ్రూర్, అజ్నాలా సబ్‌డివిజన్, మోహాలిలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను పంజాబ్ ప్రభుత్వం ఎత్తివేసింది. కాగా గురువారం తర్న్ తరన్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను శుక్రవారం మధ్యాహ్నం వరకు రద్దు చేశారు. పంజాబ్‌లోని మిగతా ప్రాంతాల్లో మాత్రం మొబైల్, ఇంటర్నెట్ సేవలు మార్చి 21 నుంచి పునరుద్ధరించారు.

రాష్ట్ర హోం వ్యవహారాల శాఖ, న్యాయశాఖ గురువారం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం ‘ప్రజా భద్రత దృష్టా, హింసకు ప్రేరేపించబడకుండా, ఏదైనా ఆటంకం కలిగించకుండా నిరోధించడానికి, తర్న్ తరన్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు పొడగించబడ్డాయి. శాంతి, పబ్లిక్ ఆర్డర్ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News