Monday, December 23, 2024

జర్నలిస్టులకు రైల్వే పాసులు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసుల జారీని రైల్వే అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రైల్వే బోర్డు నిర్ణయం తర్వాత పాసుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. పాసుల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు రాకున్నా రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారం జర్నలిస్టులకు పాసుల జారీని దక్షిణ మధ్య రైల్వే గత వారం ప్రారంభించింది. బోర్డు అనుమతి తర్వాతనే ప్రయాణ రాయితీ వర్తిస్తుందని అధికారులు ముందే చెప్పారు. ఆ విధంగానే రెండు రోజులపాటు పాసులు ఇచ్చారు. అయితే, పనికిరాని పాసులు మాకెందుకని కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు పాసు కౌంటర్ వద్ద అధికారులను ప్రశ్నించటంతో రైల్వే బోర్డు ఆదేశాలు వచ్చిన తర్వాతే పాసులు ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News