అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అన్ని రాష్ట్రాల నుండి భక్తలు వస్తుంటారు. దర్శనం అనంతరం పవిత్రమైన ప్రసాదాన్ని విక్రయించారు. కానీ ఇప్పుడు అయ్యప్ప భక్తులకు శబరి మల ఆలయంలో పవిత్ర అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. శబరిమలలో అరవణ ప్రసాదాన్ని విక్రయించవద్దని కేరళ హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డుని ఆదేశించింది. దాంతో అధికారులు ప్రసాద వితరణను ఆపేశారు.
అరవణ తయారీలో ఉపయోగించే యాలకులలో కనీస అనుమతి పరిమితి కంటే ఎక్కువ రసాయనాలు ఉన్నాయని ప్రసాదం అమ్మకూడదని హైకోర్టు ఆదేశించారు. యాలకులు వాడని ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు. కొల్లాంకు చెందిన సరఫరాదారు నుండి బోర్డు కొనుగోలు చేసిన యాలకులు రసాయన విశ్లేషణలో దాదాపు 14 పురుగుమందులను గుర్తించిన నేపథ్యంలో జస్టిస్ అనిల్ కె నరేంద్రన్ , పిజి అజిత్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
తిరువనంతపురంలోని ప్రభుత్వ విశ్లేషకుల ల్యాబొరేటరీ , ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ల్యాబొరేటరీ యాలకులును పరీక్షించిన తర్వాత, అది సురక్షితం కాదని తెలిపింది, 2021-22 మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో TDBకి మసాలా దినుసులను సరఫరా చేసిన అయ్యప్ప స్పైసెస్ అనే సంస్థ చేసిన విజ్ఞప్తిపై యాలకులును పరీక్షించారు. బోర్డు 2022-23 పోటీ , వార్తాపత్రిక, ప్రకటన లేకుండా కాంట్రాక్టును కొల్లంకు ఇచ్చిందని అయ్యప్ప స్పైసెస్ కంపెని వాపోయారు.
కొల్లాంకు చెందిన కంపెనీ సరఫరా చేసే యాలకులు నిబంధనల ప్రకారం నిర్దేశించిన MRLకి అనుగుణంగా లేకపోతే, అది ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం సురక్షితం కాదని అన్నారు. ఆహార భద్రత కమీషనర్, సన్నిధానంలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ద్వారా, యాత్రికులకు అరవణ ప్రసాదం విక్రయించబడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని బెంచ్ ఆదేశించింది.
అయితే, బోర్డు యాలకులు లేకుండా ప్రసాదాన్ని తయారు చేయవచ్చని లేదా తిరువనంతపురంలోని ప్రభుత్వ విశ్లేషకుల ప్రయోగశాల నుండి పరీక్ష నివేదికను పొందడం ద్వారా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాటిని కొనుగోలు చేసిన తర్వాత తయారు చేయవచ్చని పేర్కొంది. మధ్యంతర ఆదేశాలతో తదుపరి విచారణను జనవరి 13న కోర్టు వాయిదా వేసింది