Monday, January 20, 2025

ఈసీ కొరడా..ఏడుగురు పోలీస్‌ల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డుల తనిఖీలకు సంబంధించి బుధవారం నాడు తలెత్తిన వివాదంపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. సమాజ్‌వాదీ ఇచ్చిన ఫిర్యాదు మేరు ఓటర్‌గైడ్‌లైన్స్ ఉల్లంఘనకు పాల్పడిన ఏడుగురు పోలీస్‌లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. సస్పెండైన వారిలో కాన్పూర్,ముజఫర్‌నగర్ జిల్లాలకు చెందిన చెరో ఇద్దరు అధికారులు, మొరాదాబాద్ నుంచి ముగ్గురు అధికారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్,

కతెహారి, ఖైర్, కుందర్కి, కర్హాల్, మజవాన్, మీరాపూర్, ఫుల్పుర్,సిషామౌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పోలీస్ అధికారులు చట్టవిరుద్ధంగా ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు తనిఖీ చేస్తున్నారని, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కొన్ని కమ్యూనిటీలను ఓటు వేయకుండా నిరోధిస్తున్నారని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే నెగ్గాలని బీజేపీ కోరుకుంటోందని, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News