Monday, December 23, 2024

బలవంతపు ముద్దుకు మూల్యం

- Advertisement -
- Advertisement -

మాడ్రిడ్: స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ తమ దేశ స్టార్ క్రీడాకారిణి జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు.ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమలులో ఉంటుందని ఫిఫా ప్రకటించింది.

సస్పెన్షన్‌తో పాటుగా క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. కాగా స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజంటేషన్ సందర్భంగా రుబియాలెస్ .. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగాముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. రుబియాలెస్‌నుంచి ఈ అనూహ్య ప్రవర్తనను చూసి జెన్నిఫర్‌తో పాటుగా అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

ఓ మహిళను మె ఇష్టానికి వ్యతిరేకంగా చుంబించడం సమర్థనీయం కాదంటూ సానిష్ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. రుబియాలెస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడాశాఖకు సంబంధించిన స్పానిష్ హైకౌన్సిల్ రుబియాలెస్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ప్రపంచ ఫుట్‌బాల్ అసోసియేషన్ అయిన ఫిఫా జోక్యం చేసుకుని రుబియాలెస్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News