Friday, January 10, 2025

టిఆర్‌ఎస్ సభ్యులపై ‘వేటు’

- Advertisement -
- Advertisement -

ముగ్గురు టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు

ధరాఘాతంపై చర్చకు పట్టుబట్టిన ఫలితం
సమస్యలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా?
నిలదీసిన ఎంపి వద్దిరాజు రవిచంద్ర

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ స భ్యుల నిరసనలు, ఆందోళనలతో రాజ్యసభ ద ద్దరిల్లింది. సభా కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఆందోళన చేస్తున్న సభ్యులను డిప్యూటీ చైర్మన్ పలుమార్లు వారించారు. అయినప్పటికీ వారు వెనక్కు తగ్గకపోవడంతో టిఆర్‌ఎస్ ఎంపీలను వారం రోజుల పాటు డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. స స్పెండ్ అయిన వారిలో ఎంపిలు బడుగులు లింగయ్యయాదవ్, దీవకొండ దామోదర్‌రా వు, వద్దిరాజు రవిచంద్రలు ఉన్నారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే వెల్లోకి టిఆర్‌ఎస్ సభ్యులు దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభ లో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. దేశంలో పెరుగుతున్న ధరలు, జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చిన పాల ఉత్పత్తుల ధరలపై టిఆర్‌ఎస్ సభ్యులు మొదటి నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది.

ఈ నేపథ్యంలో వాటిపై సభలో సమగ్ర చర్చ జరగాలని సభ మొదలైన రోజు నుంచే పట్టుబడుతోంది. అయినప్పటికీ వీటిపై చర్చించడానికి కేంద్రం ముందుకు రాకపోవడంతో విపక్ష పార్టీలతో కలిసి ఉభయ సభల్లో టిఆర్‌ఎల్ ఎంపిలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందున సభను తొలుత 20 నిమిషాలు, తర్వాత మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి ప్రకటించారు. తిరిగి సమావేశం అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడని నేపథ్యంలో బుధవారానికి రాజ్యసభను వాయిదా వేశారు. అయితే సభ నుంచి బడుగు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర రావు ను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

సమస్యలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా?

సభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో టిఆర్‌ఎస్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ కోరితే సభ్యులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగనప్పడు…ఇక సమవేశాలను నిర్వహించడం ఎందుకు? అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ంతో తెలంగాణలో వరదలు వచ్చాయన్నారు. వాతావరణం అనుకూలించకపోయిన రోడ్డు మార్గంలో సిఎం కెసిఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్లో భరోసా నింపారన్నారు. ముంపు ప్రజల కోసం రూ.1000 కోట్లు ప్రకటించారన్నారు. వరద నష్టం అంచనాలను కేంద్రానికి పంపితే ఇప్పటివరకు స్పందన లేదన్నారు. ఇక జిఎస్‌టి భారం, ధరల పెంపుతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై వారం రోజులుగా సభలో ఆందోళన చేస్తున్నామన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

ప్రజా సమస్యలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని నిలదీశారు. అప్రజాస్వామికంగా 19 మందిని సస్పెండ్ చేశారన్నారు ఇది బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు. ఈ సస్పెన్షన్లకు తాము వెనకడుగు వేసేది లేదన్నారు. సిఎం కెసిఆర్ దిశానిర్ధేశంలో కేంద్రంపై తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా వద్దిరాజు హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News