Sunday, February 2, 2025

కరీంనగర్‌లో ఇద్దరు బిజెపి కార్పొరేటర్ల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లపై బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 32వ డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన, 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవితోపాటు, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి సతీష్‌లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. తక్షణమే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు నాయకులు తమ వ్యవహారశైలిపట్ల వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News