Monday, December 23, 2024

అనుమానాస్పదంగా 10 నెలల బిడ్డతో తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: భర్త, అత్త ఇతర కుటుంబ సభ్యుల వేధింపులతో 10 నెలల బిడ్డతో సహా తల్లి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి… రాంనగర్ బాకారంకు చెందిన విద్యాసాగర్‌కు అంబరుపేట పటేల్ నగర్‌కు చెందిన లూకరాజు కుమార్తె విజయ వసంత కుమారి (33)తో 2012లో వివాహమైంది. వీరిరువురికి పదేళ్ళ తర్వాత 2022లో విద్యా ధరణి (10 నెలలు) జన్మించింది. పెళ్లైన తొలి రోజుల నుంచే భర్త విద్యాసాగర్, అత్త విక్టోరియా, ఆడ పడుచు, ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారు.

Also Read: ఆగని బెట్టింగ్ దందా..

ఈ క్రమంలో అడిగినంత కాకున్నా.. కొద్దో గొప్పో ముట్టచెప్పినట్లు బాధితురాలి బంధువులు ముట్టజెప్పారు. అయితే ఆడ పిల్లకు జన్మనిచ్చిన తరువాత విడాకులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈనెల 3వ తేదీన తమ్ముడి పెళ్లికి కూడా విద్యాసాగర్ తన భార్య విజయవసంతకుమారిని పంపలేదు. తమ్ముడి పెళ్లి జరిగినప్పటి నుంచి విజయపై భర్త, ఇతర బంధువుల వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. శనివారం అకస్మాత్తుగా 10నెలల బిడ్డతో మరణించినట్టుగా పోలీసులు సమాచారం అందింది. సంఘటనా స్థలంలో పోలీసులకు పురుగుల మందు డబ్బా దొరికింది. పోలీసులు శవ పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విజయ వసంతకుమారి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనీ, తన కుమార్తెను కచ్చితంగా భర్త విద్యాసాగర్,

అత్త విక్టోరియా హత్య చేసి ఉంటారని తండ్రి లూకరాజు ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బిడ్డకు విషం ఇచ్చి తాను తాగి మరణించిందా లేదంటే, భర్తనే బలవంతంగా పురుగుల మందు తాగిపించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడా అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News