Thursday, January 23, 2025

అనుమానాస్పదరీతిలో యువతి మృతి

- Advertisement -
- Advertisement -

ఆదిభట్ల్ల: అనుమానాస్పదరీతిలో ఓయువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొంగరకలాన్‌లో చోటుచేసుకుంది. మహేశ్వరం డిసిపి శ్రీనివాస్, ఆదిభట్ల సిఐ రవికుమార్‌ల కథనం మేరకు వివరాలు ఈవిదంగా ఉన్నాయి. కొంగరతండాకు చెందిన యువతి (21) రావిరాల్ సమీపంలోని వండర్‌లా లో పనిచేస్తోంది. రోజుమాదిరిగా గురువారం ఉద్యోగానికి వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

రాత్రి ఎంత గాలించినా ఆమె జాడ తెలియలేదు. కాగా శుక్రవారం ఉదయం కొంగర సమీపంలోని ఓ వెంచర్‌లో ఆ యువతి చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
యువతిది హత్య అంటూ బంధువుల ఆందోళన
యవతిది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తూ ఆమె కుటుంభసభ్యులు,బందువులు కొంగకరలాన్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వా రుమాట్లాడు తూ..ఓ యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో ఆ యువతిని వేధిస్తున్నట్లు చెప్పారు. ఆ యువకుడే యువతిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లువారు ఆరోపించారు. అనంతరం కొంగరకలాన్‌లో బంజారా సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కలుగజేసుకుని వారిని శాంతింపజేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News