- Advertisement -
మహబూబాబాద్: మహబూబాబాద్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడిని బోడ నరసింహ(58) టేకులపల్లి మండలం లక్ష్మీపురం వాసిగా గుర్తించారు. నెలరోజుల క్రితం నరసింహ కోడలు మౌనిక హత్య గురైంది. మౌనిక హత్య కేసులో ప్రస్తుతం నరసింహ కుమారుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మౌనిక కుటుంబసభ్యులే నరసింహను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు.
- Advertisement -