Monday, December 23, 2024

కలెక్టరేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: కలెక్టరేట్ ఉద్యోగి అ నుమానస్పదంగా కాలిపోయి విగత జీవిగా పడి ఉ న్న సంఘటన కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. కొండాపూర్ పోలీసులు తెలిపినకథనం ప్రకారం సంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి విష్ణు(45) అనుమానస్పద రీతిలో మృతి చెందినట్లు స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగిందన్నారు. గత మూడునెలల క్రితంఅతనికి గుండెలో స్ట్రం ట్ వేయడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి చికిత్స తీసుకుంటున్నాడన్నారు. ని ర్మానుష్య ప్రదేశంలో కలిపోయి విగతజీవిగా పడడంతో హత్య చేసినట్లు స్థానికులు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగి విష్ణుకి భా ర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కలెక్టరేట్ ఉద్యోగి విష్ణు మృతిని ఆత్మహత్య గా నిర్ధ్దారణకు వచ్చామమని కొండాపూర్ సిఐ చంద్రయ్య తెలిపారు. సంఘటన స్థలం వద్ద రెండు పెట్రోల్ తీసుకువచ్చిన కాలీ బాటిల్‌లను గుర్తించామ ని, విష్ణుకి ఎవరితో గొడవలు లేవని కుటుంబ సభ్యుల ద్వారా తెలసుకున్నామన్నారు. మనస్థాపంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. సంఘటన స్థలాన్నీ సంగారెడ్డి డిఎస్‌పి రమేష్ కుమార్, కొండాపూర్ ఎస్‌ఐ వినయ్‌కుమా ర్, క్లూస్ టీం సిబ్బంది పరిశీలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కొండాపూర్ సిఐ పేర్కోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News