స్నేహితులతో కలిసి వెళ్లిన బాధితుడు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ : స్విమ్మింగ్ పూల్‌లో పడి ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పాతబస్తీలోని ఫలక్‌నుమా, జహనూమ, జామియా మజీద్ సమీపానికి చెందిన సయిద్ సమీ ఉద్దిన్(24) క్రికెట్ ఆడేందుకు ఉదయం 8గంటలకు స్నేహితులు ఇలియాస్, సోహైల్, జహీర్‌తో కలిసి బయటికి వెళ్లాడు. చార్మినార్ సమీపంలోని కిలావత్‌లో క్రికెట్ ఆడిన తర్వాత స్విమ్మింగ్‌కు కొసం అందరూ కలిసి చాంద్రాయణగుట్ట సమీపంలోని ముంతాజ్‌బాగ్‌లోని బిల్‌వైల్స్ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లారు. అక్కడ ఈత రాని సమీ ఉద్దిన్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. ఇది గమనించి సిమ్మింగ్‌పూల్ వర్కర్, స్నేహితులు చూసి బయటికి తీసి ఓవైసి ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. స్విమ్మింగ్‌పూల్ నిర్వాహకులు, సూపర్‌వైజర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతిచెందాడని, ఐదుఅడుగుల లోతులో పడి చనిపోవడం ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.