Monday, December 23, 2024

జహీరాబాద్ మాజీ ఎంపిపి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: జహీరాబాద్ మండల మాజీ ఎంపిపి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి లక్ష్మారెడ్డి (67) శంకర్‌పల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌లో తన కారును పార్కు చేసినట్లు సంబంధికులు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శంకర్‌పల్లి నుంచి కిలో మీటరు దూరంలో హైదరాబాద్ వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బోరున విలపించారు.వికారాబాద్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రైలు ఢీ కొట్టడంతో మృతదేహం ఛిద్రమైంది.గురువారం రాత్రి 10 గంటల సమయంలో లక్ష్మారెడ్డి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆత్మహత్యనా? హత్యనా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. లక్ష్మారెడ్డి కి తల్లి మాజీ సర్పంచ్ ఈశ్వరమ్మతో పాటు భార్య అనిత, పెళ్లైన ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుర్లు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అటు రాజకీయాల్లో ఉంటూనే వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు.

ఇటీవల పొలాన్ని కౌలు ఇచ్చి హైదరాబాద్‌లోని నిజాంపేటలో కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్నారు. తరచూ స్వగ్రామానికి వచ్చి వెళుతూ ఉండేవారు. మృతికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సింది ఉంది. ఈ మేరకు వికారాబాద్ రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News