- Advertisement -
చౌటుప్పల్: చౌటుప్ప ల్ పురపాలక కేంద్రంలో టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఒకటి సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం..ఆడెపు శ్రీను(50) చౌటుప్పల్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.
రోజూ మాదిరిగానే టిఫిన్ సెం టర్‌లో విధుల్లో నిమగ్నమైన శ్రీను విధు లు ముగించుకుని ఇంటికి రాక పోవడంతో అనుమానం వచ్చిన భార్య హోటల్‌కు వచ్చి చూడగా అప్పటికే భర్త మృతి చెంది కనిపించాడు. ఒంటిపై బట్టలు లేకుండా పడి వుండడంతో భార్య పోలీసులకు ఫిర్యాధు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీను మృతిపై విచారణ జరు పు తున్నారు. అతడి మృతికి గల కారణాలు పోలీసు లు విచారణలో తేలనుంది.
- Advertisement -