Monday, December 23, 2024

ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి మృతదేహం..

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ ః ఆదిలాబాద్ పట్టణంలోని స్వీపర్స్ కాలనీలో ఓ యువకుడి అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారంలో భాగంగా యువతి తరపు కుటుంబ సభ్యులు యువకుడిని హత్య చేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. యువతి ఇంటి ముందు యువకుడి మృతదేహాం పడి ఉండడంలో అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం .. పట్టణంలోని స్వీపర్స్ కాలనీకి చెందిన 29 యేళ్ల మంతేని వినోద్ అదే కాలనీకి చెందిన యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు యువతితోనే ఫోన్‌లో మాట్లాడినట్లు మృతుడి అన్న మురళీ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.

Also Read: అవినీతి రాజకీయాలతో నిత్యావసరాల ధరలకు రెక్కలు:ప్రియాంక గాంధీ

అయితే పది గంటల సమయంలో యువతి ఇంటి ముందు సృహా కోల్పోయినట్లు గమణించిన రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించినట్లు తెలిపారు. మృతుని అన్న ఫిర్యాదు మేరకు అనుమానస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్లు సీఐ తెలిపారు. కాగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా యువతితో ప్రేమలతో ఉన్న కారణంగానే వారి కుటుంబ సభ్యులు వినోద్‌ను హత్య చేసినట్లు ఆరోపించారు. గతంలో కూడా వినోద్ పై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారని తెలిపారు. బుధవారం సైతం దాడి చేశారని తెలిపారు. బుధవారం సైతం దాడి చేసి హతమార్చినట్లు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News