Sunday, January 19, 2025

కుల్కచర్లలో యువతి మృతి.. తండ్రే చంపాడని తల్లి ఆరోపణ

- Advertisement -
- Advertisement -

Suspicious death of young woman in Kulkacharla

కుల్కచర్ల: వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండలం గట్టన్నపల్లిలో యువతి మృతి చెందింది. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన యువతిని అంకిత(19)గుర్తించారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తండ్రి లక్ష్మయ్య చెబుతున్నాడు. అంతికిను తండ్రి, మరో మహిళ కలిసి చంపారని తల్లి ఆరోపిస్తోంది. అంకిత తల్లిని కొన్నాళ్ల క్రితం లక్ష్మయ్య ఇంటి నుంచి వెళ్లాగొట్టి, మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి తన బిడ్డను చిత్రహింసలు పెట్టారని తల్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News