- Advertisement -
రంగారెడ్డి : శంషాబాద్ రాయల్‌విల్లా కాలనీలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ రాయల్‌విల్లా కాలనీకి చెందిన పూజిత అనే విద్యార్థి సివిల్స్ కు ప్రిపేర్ అవుతుందని తెలిపారు. అనుమానస్పదంగా విద్యార్థిని మృతి చెందడంతో పూజిత చావుకు మహ్మద్ అలీ కారణమని విద్యార్థిని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -