గన్‌ఫౌండ్రీ: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. గురువారం ఏఐవైఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో రా ష్ట్రాధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యనేతగా హాజరైన ఆర్.తిరుమలై రామన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిరుద్యోగుల భవిష్యత్ పై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. టిఎస్‌పిఎస్‌ఎసి పోటీ పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించలేక విఫలమైందని అన్నారు.
ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కా లయాపన చేస్తుందని వాపోయారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచలేని ప్రభుత్వ పథకాలు అవసరం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ సంస్థలను స్థాపించాలని త ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేద్రలు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొని ఉన్న నిరుద్యోగ సమస్యపై తాము పోరాటాలు చేయనున్నట్లు వారు వెల్లడించారు.
యువతకు ఉపాధికల్పించే పార్టీలకే రానున్న ఎన్నికల్లో ఓటు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తితంగా చైతన్యం తేనున్నామని వారు పేర్కొన్నారు. ఈసమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్‌బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, కనుకుంట్ల శంకర్, లింగం రవి, వెంకటేశ్వర్లు, యుగంధర్, కార్యవర ్గసభ్యులు రామకృష్ణ,సత్యప్రసాద్, ఆర్.బాల కృష్ణ,బిజ్జ శ్రీనివాస్, లక్ష్మణ్, కిషోర్, సల్మాన్, మహేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.