- Advertisement -
నెపిడా : సైనిక నిర్బంధంలో ఉన్న మయన్మార్ నేత అంగసాన్ సూకీ (76), ఆమె వ్యక్తిగత సిబ్బంది కొవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు ఆమె న్యాయవాది మిస్మిస్ షో వెల్లడించారు. మయన్మార్లో కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ఫిబ్రవరిలో సూకీని సైనికులు నిర్బంధం లోకి తీసుకున్నారు. సూకీని నిర్బంధంలో ఉంచిన గృహంలో ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది, వంట పనివారు, దాదాపు పది మంది వరకు ఉన్నారు. మయన్మార్ లో కరోనా ఉద్ధృతంగా ఉండడంపై సూకీ ఆందోళన చెందుతున్నారని న్యాయవాది తెలిపారు.
- Advertisement -