Monday, December 23, 2024

ఆర్‌టిసి బస్సు-టాటా సుమో ఢీ: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం గడగ్ జిల్లాలోని నారేగల్-గజేంద్రగడ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గడ్డిహళ్లి ప్రాంతంలో టాటా సుమో- కెఆర్‌టిసి బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతులు శివకుమార్ కళిశెట్టి(48), భార్య చంద్రకళ కళిశెట్టి(42), రాణి కళిశెట్ట్టి(25)లు అలండ్ తాలూకాలోని మాదనాహిప్పరాగా గ్రామం, సచిన్ కట్టి(32), ద్రక్షాయిణి కట్టి(29), దింగలేష్(06) అఫ్జల్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడినవారు అనుశ్రీ(08), మహేష్(07), ప్రభుదేవ్(09)గా గుర్తించారు. స్థానిక ఎంఎల్‌ఎ జిఎస్ పాటిల్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సిఎం సిద్ధరామయ్య, మంత్రి హెచ్‌కె పాటిల్‌కు పోన్ చేసి సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News