Monday, January 6, 2025

మారుతీ బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్.. ఏ కారు ఎక్కువ మైలేజీ ఇస్తుంది?

- Advertisement -
- Advertisement -

కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్లో కార్లు కొనాలంటే మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ చాలా బెస్ట్ ఒప్షన్స్.ఈ కార్లు మార్కెట్లో చాలా ప్రజాదరణ పొందినవి. మారుతి సుజుకి బ్రెజ్జా మెరుగైన మైలేజీకి కేర్ అఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, భద్రత పరంగా చూస్తే టాటా నెక్సాన్ తీసుకోవచ్చు. కాగా, ఈ రెండు కార్లు రూ. 10 లక్షల రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మారుతీ బ్రెజ్జా, టాటా నెక్సాన్ రెండు కార్లను పోలిస్తే ఏది మంచి మైలేజ్ ఇస్తుందో చూద్దాం.

మారుతి బ్రెజ్జా

మారుతి బ్రెజ్జా ఒక హైబ్రిడ్ కారు. ఈ కారు K15 C పెట్రోల్ + CNG (ద్వి-ఇంధనం) ఇంజిన్‌తో వస్తుంది. దీని వలన ఈ కారు పెట్రోల్ అదేవిధంగా CNG మోడ్‌లలో నడుస్తుంది. ఈ వాహనంలో అమర్చబడిన ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో 6,000 rpm వద్ద 100.6 PS శక్తిని అందిస్తుంది. కాగా, 4,400 rpm వద్ద 136 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక CNG మోడ్‌లో అయితే ఈ వాహనం 5,500 rpm వద్ద 87.8 PS శక్తిని, 4,200 rpm వద్ద 121.5 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మారుతికి చెందిన ఈ కారు కిలోకు 25.51 కిమీ మైలేజీని ఇస్తుంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ హైబ్రిడ్ కారు కాదు. కానీ,ఈ కారు పెట్రోల్, డీజిల్, CNG పవర్‌ట్రెయిన్ ఎంపికతో వస్తుంది. ఈ టాటా కారులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 5,500 rpm వద్ద 88.2 PS శక్తిని అందిస్తుంది. 1,750 నుండి 4,000 rpm వద్ద 170 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా నెక్సాన్ 17 నుండి 24 kmpl మైలేజీని ఇస్తుంది.

టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుండి మొదలై రూ. 15.50 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు.. మారుతి బ్రెజ్జా ధర రూ. 8.34 లక్షల నుండి మొదలవుతుంది. దాని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.14 లక్షల వరకు ఉంది. టాటా నెక్సాన్ గ్లోబల్ NCAP నుండి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మరోవైపు.. మారుతి బ్రెజ్జా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. టాటా నెక్సాన్ 382 లీటర్ల బూట్-స్పేస్ కలిగి ఉంది. బ్రెజ్జా 328 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News