- Advertisement -
హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటి హెచ్), సుజుకీ మోటర్ కార్పోరేషన్ (ఎస్‌ఎంసి) జపాన్‌తో మూడు సంవత్సరాల కాలానికి ఒప్పందం చేసుకుని సుజుకీ ఇన్నోవేషన్ కేంద్రం(ఎస్‌ఐసి)ను ప్రారంభించింది. ఈ రెండు సంస్థల మధ్య విజ్ఞాన మార్పిడి కోసం ఓ వేదికను అందించడం ద్వారా భారత్, జపాన్ దేశాలకు ఆవిష్కరణలను సృష్టించడం ఈ కేంద్రం ముఖ్య లక్ష్యంగా ఉంది. నాలెడ్జ్ షేరింగ్ కోసం విదేశీ కంపెనీతో ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం ఇదే మొదటిసారి. నైపుణ్యాభివృద్ధి, ఇండియాజపాన్‌ల మధ్య మానవ వనరుల మార్పిడికి ఈ కేంద్రం మద్దతునందిస్తుందని ఐఐటి హెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి తెలిపారు.
- Advertisement -