Monday, February 24, 2025

అందుబాటు ధరలో హైబ్రిడ్ కారు తీసుకువస్తున్న మారుతి

- Advertisement -
- Advertisement -

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి త్వరలో చిన్నపాటి హైబ్రిడ్ కారు తీసుకువస్తోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయిస్తామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ వెల్లడించారు. పైగా ఇది ప్రస్తుతం ఉన్న కార్ల కంటె అధిక మైలేజి ఇస్తుందని ఆయన తెలిపారు. వివిధ హైబ్రిడ్ కార్లలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అధిక వ్యయంతో కూడుకున్నదని, అందుకే హైబ్రిడ్ కార్ల ధరలు అధికంగా ఉంటున్నాయని ఆయన వివరించారు. తాము తక్కువ ఖ ర్చుతో హైబ్రిడ్ కార్ల సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని భార్గవ తెలియజేశారు. కేంద్రం కూడా సహకరించి హైబ్రిడ్ వాహనాలపై జిఎస్‌టి తగ్గించాలని, అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. మారుతి సుజుకి త్రైమాసికం ఫలితాల వెల్లడి సందర్భంగా భార్గవ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News