Wednesday, January 22, 2025

ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’..

- Advertisement -
- Advertisement -

సోహెల్, మృణాళిని రవి జంటగా డా. రాజేంద్ర ప్రసాద్, మీనా, అలీ, సునీల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’. కల్పన చిత్ర బ్యానర్‌పై కల్పన కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం షూటింగ్ బేగంపేట్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్.వి.కృష్ణా రెడ్డి జన్మదిన వేడుక చిత్ర యూనిట్ సమక్షంలో ఆహ్లాదకరంగా జరిగింది. అనంతరం ఎస్.వి.కృష్ణా రెడ్డి మాట్లాడుతూ “హీరో సోహెల్ కామెడీ, సెంటిమెంట్, ఫైట్స్, డ్యాన్స్ బాగా చేస్తున్నాడు. అతనికి కమర్షియల్ హీరో లక్షణాలున్నాయి. మృణాళిని రవి మంచి నటి. సున్నితమైన భావాలను బాగా పలికిస్తుంది”అని అన్నారు. నిర్మాత కల్పన మాట్లాడుతూ “మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.కళ్యాణ్, అచ్చి రెడ్డి, సోహెల్, మృణాళిని రవి తదితరులు పాల్గొన్నారు.

SV Krishna Reddy Directed ‘Organic Mama Hybrid Alludu’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News