- Advertisement -
హైదరాబాద్: ఉమ్మడి ఎపి మాజీ సిఎస్ ఎస్ వి ప్రసాద్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. కరోనా వైరస్ తో పోరాడి ప్రసాద్ మృతి చెంది 24 గంటలు గడవక ముందే ఆయన సతీమణి లక్ష్మి కరోనాతో మృత్యువాతపడ్డారు. బుధవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఆమె చనిపోయారు. వారం రోజుల క్రితం ఎస్ వి ప్రసాద్ కుటుంబంలో ప్రసాద్, భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు వర్ధన్ శైలేష్ కరోనా సోకింది. ప్రసాద్, ఆయన భార్య యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కుమారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -