లండన్ : మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన స్వాబ్ నమూనాలతో కొవిడ్‌ను నిర్ధారించే పరీక్షను బ్రిటన్ పరి శోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరీక్షకు చాలా తక్కువ వ్యయం అవుతుంది. ముక్కు నుంచి సేకరించిన స్వాబ్ నమూనాలను పరీక్షించడం ద్వారా కొవిడ్ పాజిటివ్‌గా తేలిన రోగుల మొబైల్ ఫోన్ స్క్రీన్ స్వాబ్ నమూనాలను పరీక్షించినా పాజిటివ్‌గా వచ్చినట్టు యూనివర్శిటీ కాలేజీ లండన్ నేతృత్వంలోని పరిశోధకులు బృందం గుర్తించిం ది. తాజా పరీక్ష పద్ధతిని ఫోన్‌స్క్రీన్ టెస్టింగ్ (పోస్ట్)గా వ్యవహరిస్తారు. పోస్ట్ పరీక్షను క్లినికల్ టెస్ట్‌గా కాకుండా పర్యావరణ పరీక్షగా పరిగణిస్తారని పరిశోధకులు పేర్కొ న్నారు. ముక్కు ద్వారా సేకరించే నమూనాలను పరీక్షించే పిసిఆర్ పరీక్షతో పోలిస్తే పోస్ట్ టెస్ట్‌ను సులువుగా తక్కువ వ్యయంతో చేపట్టవచ్చని చెప్పారు. ఫోన్ ద్వారా నమూనాలను నిమిషంలో సేకరించ వచ్చని, దీనికి వైద్య సిబ్బంది ప్రమేయం అవసరం లేదని డయాగ్నసిస్ బయోటెక్‌లో పరిశోధకుడు, యూసిఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తాలజీకి చెందిన రొడ్రిగొ యంగ్ తెలిపారు.
మొబైల్‌ఫోన్ స్క్రీన్‌తో కొవిడ్ నిర్ధారణ పరీక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -