Wednesday, January 22, 2025

ఇంటర్ ఎగ్జామ్ లో స్వచ్ బడి వ్యాసం… సిద్దిపేటకు దక్కిన గౌరవం

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి ప్రయోగాశాల.. పరీక్షల్లోకి

సిద్ధిపేట స్వచ్ఛ బడి కి అరుదైన గౌరవం..

ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ లో కీలక ప్రశ్నగా ప్రస్తావన..

మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావిస్తూ నాలుగు మార్కుల ప్రశ్న గా స్వచ్ బడి వ్యాసం..

లక్షలాది మంది విద్యార్థులకు చేరిన స్వచ్ఛ ప్రయోగశాల

పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవం.. అభివృద్ధి సార్థకతకు నిదర్శనం..

అభివృద్ధి ప్రజల భాగస్వామ్యానికి దక్కిన గౌరవం అని సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు..

Swachh Badi poem in Inter exams
సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధికి ప్రయోగశాల అని, అధ్యయన కేంద్రం అని ఎన్నో మార్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. అదేవిధంగా సిద్దిపేట అభివృద్ధి ని చూసేందుకు వచ్చిన ప్రముఖుల మాటల్లో విన్నామని, మరో సారి ఆ మాటలు నిజం కావడానికి నిదర్శనంగా ఈ రోజు సిద్దిపేట అభివృద్ధిలో దేశంలో రెండో స్వచ్ బడి సిద్దిపేట లో ఇటీవల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.. ఈ స్వచ్ బడిపై నేడు సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్ లో ఒక ప్రశ్నగా రావడం మంత్రి హరీష్ రావు అభివృద్ధి దక్కిన అరుదైన గౌరవం. 4 మార్కులతో ఒక వ్యాస రూపంలో స్వచ్ బడిపై ప్రశ్నగా ఇచ్చారు. మొదటిది బెంగుళూరు నగరం ఉండగా రెండో స్థానంలో సిద్దిపేట ఉంది. ఈ ప్రశ్న రాష్ట్రంలోని లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు ఒక స్ఫూర్తిని ఇచ్చింది. సిద్దిపేట ప్రజలకు అభివృద్ధి ఒక గొప్ప గౌరవంగా నిలిచింది.

ఇంకుడు గుంతలు పాఠ్యపుస్తకాల్లో.. స్వచ్ బడి పరీక్షల్లో..

సిద్ధిపేట అవార్థుల్లో ఆదర్శంకాగా దేశం లో కానీ రాష్ట్రంలో కానీ అవార్డులు ప్రకటించారు అంటే సిద్దిపేట పేరు లేకుండా ఉండదు. దేశంలోనే ఇంకుడు గుంతలు నిర్మించి ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామం తొలి స్థానంలో ఉంది. ఇంకుడు గుంతల నిర్మాణం ఒక ప్రయోగాత్మకం అంటూ పాఠ్యపుస్తకాల్లో పాఠంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే స్ఫూర్తితో మరో గౌరవం సిద్దిపేట స్వచ్ బడి రూపంలో దక్కింది. నేడు ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నగా వచ్చింది.. నాడు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా నేడు పరీక్షల్లో ప్రశ్నగా సిద్దిపేట మరో ఘనత సాధించింది.

పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవమని, అభివృద్ధి సార్థకతకు నిదర్శనం..

అభివృద్ధి ప్రజల భాగస్వామ్యానికి దక్కిన గౌరవం అని సంతృప్తి వ్యక్తం చేస్తు మంత్రి హరీష్ రావు నియోజకవర్గ ప్రజలు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు

సిద్దపేట అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనంలో భాగంగానే సిద్దిపేట లో స్వచ్ బడి ని ఏర్పాటు చేసామని మంత్రి హరిశ్ రావు అన్నారు. సిద్దిపేట స్వచ్ఛతతో ఆదర్శంగా నిలవాలి అంటే స్వచ్ బడి పాఠాలు ప్రతీ ఒక్కరికీ చేరడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ స్వచ్చ్ బడిని సందర్శించి చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు లక్షలాది మంది హాజరయ్యే ఇంటర్ బోర్డు ఎగ్జామ్ పరీక్ష పత్రంలో చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయం మాకు, మా సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది ముఖ్యంగా మా ప్రజలకు గర్వకారణమని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని వినూత్నమైన, ఆదర్శమైన కార్యక్రమాలను చేపడతామని, ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News