Thursday, January 23, 2025

స్వచ్ఛ భారత్ గొప్ప కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : స్వచ్ఛభారత్ కార్యక్రమం గొప్పదని భారతదేశ నిర్మాణంలో స్వచ్ఛత ముఖ్యభూమిక పోషిస్తుందని ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈనెల 16వ తేది నుండి 30వరకు సింగరేణిలో నిర్వహిస్తున్న స్వచ్ఛత పక్షోత్సవాలను పురస్కరించుకోని జిఎమ్ కార్యాలయంలో నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడారు.

పరిసరాలు శుభ్రంగా వుంటేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని, ప్రతిఒక్కరు తమ ఇళ్ళ పరిసర ప్రాంతాలను శుభ్రంగా వుంచుకోవాలన్నారు. అనంతరం నార సంచులు, పండ్ల మొక్కలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎమ్ మల్లారపు మల్లయ్య, సేఫ్టి అధికారి పంజాల శ్రీనివాస్, డిజిఎమ్ పర్సనల్ జివి మోహన్‌రావు, పర్యావరణ అధికారి ధనుంజయ్‌రెడ్డి, డివైపిఎమ్ శ్రీహరి, సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్, టిబిజికేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News