Monday, December 23, 2024

దేశం గొప్పదని నమ్మిన వ్యక్తి వాజ్‌పేయి: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఏ పని చేసినా నిబద్ధతతో వ్యవహరించే మాజీ ప్రధాని వాజ్‌పేయి దేశం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి నిర్ణయాలు తీసుకునేవారని బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం సుపరిపాలన దినోత్సవం, మాజీ ప్రధాని ఎ.బి. వాజ్‌పేయి జయంతి సందర్బంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బిజెపి నిర్వహించింది. దీనిలో పాల్గొన్న ఎంపి లక్ష్మణ్ పలుబస్తీలలో రోడ్లను చీపురుతో ఊడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు విలువలతో కూడిన రాజకీయాలను వాజ్‌పేయి చేశారని కొనియాడారు.

సుపరిపాలన అంటే ఏమితో వాజ్‌పేయిని చూసి నేర్చుకోవాలన్నారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకుందన్నారు. పరిపాలనలో మచ్చలేని వ్యక్తిగా ఆయన పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఒక్క ఎంపీ ఓటు కొనకుండా, వారిపై ఒత్తిడి తీసుకురాకుండా పారిపాలన చేశారని గుర్తు చేశారు. ఈరోజు కులం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వీటిని ప్రజలు గమనించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News