Friday, November 22, 2024

సిద్దిపేట ఖాతాలో మరో అవార్డు స్వచ్ఛ సర్వేక్షన్ 2021

- Advertisement -
- Advertisement -

దేశ స్థాయిలో మెరిసిన సిద్దిపేట పుర ప్రజల కీర్తి..

భారతాన మారు మ్రోగిన మన సిద్దిపేట పుర ఖ్యాతి… !!

ప్రసిద్ధిపేటగా… దేశ ఖ్యాతి…

సిద్దిపేట శుద్ధిపేట అని మరో సారి జాతీయ స్థాయిలో చాటి చెప్పిమ సిద్ధిపేట..

స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ఎంపిక అయిన సిద్దిపేట పట్టణం..

ఈనెల 20న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ ను అందుకోనున్న మున్సిపల్ చైర్మన్, కమీషనర్

పుర ప్రజల భాగస్వామ్యం, ఐక్యతకు గొప్ప నిదర్శనం.. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు

swachh survekshan award to Siddipet

హైదరాబాద్: సిద్దిపేట అభివృద్ధి పేట… శుద్ధిపేట.. ఆకుపచ్చ అవార్డుల్లో ఆదర్శ పేట అని మరో సారి భారతాన మన సిద్దిపేట పేరు మారు మ్రోగింది… స్వచ్ఛ సర్వేక్షన్ 2021 అవార్డును సిద్దిపేట పట్టణం కైవసం చేసుకుంది.. ఎన్నో అవార్డులకు పెట్టింది పేరు మన సిద్దిపేట పట్టణం.. మంత్రి హరీష్ రావు గారి స్పూర్తితో ..వారి మార్గదర్శనం తో ఇప్పటికే పట్టణం లో పరిశుభ్రత, పచ్చదనం , తడి పొడి చెత్త సేకరణ ఎలా ఎన్నో అంశాల పై 17 రాష్ట్ర జాతీయ స్థాయి అవార్థులు సాధించి దేశంలో నే శుద్దిపేట గా గుర్తింపు పొందింది. ఇది మంత్రి హరీష్ రావు కృషి, ప్రజల భాగస్వామ్యం తోనే సాధ్యం అవుతుందటానికి ఇది గొప్ప నిదర్శనమని మరో సారి చాటి చెప్పింది.. స్వచ్ఛ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో మరో సారీ ఎంపిక అయింది..

మూడు ప్రధాన అంశాల్లో.. 50 సూచికలు…

” స్వచ్ సర్వేక్షన్ అవార్డు ఎంపిక కావడం లో ప్రధానంగా మూడు అంశాలు 50 సూచికలతో సాధ్యం అయింది. సేవా స్థాయి పురోగతిలో నాణ్యమైన చెత్త సేకరణ మూడు రకాలు తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ, వీటి ప్రక్రియ చెత్తను తొలగించడం, పారిశుద్ధ్య పని తీరు, సర్టిఫికెషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ఉపయోగించడం, అవగాహన కార్యక్రమాలు చేయడంలో సిద్దిపేట పుర పాలక సంఘం పనితీరు పట్ల అవార్థులకు ప్రధాన అంశాలుగా మారాయి.

సూర్య కిరణాలు కాంతి వెలుగులో సిద్దిపేట మెరవాలి… !!

స్వచ్చతపై పాట, అవగాహన కార్యక్రమాలు గొప్ప చైతన్యం ..!!

” సూర్య కిరణాల కాంతి వెలుగులో సిద్దిపేట మెరవాలి… చంద్రుడు సైతం సిద్దిపేట ను తొంగి చూడాలి… స్వచ్ఛత… స్వచ్ఛత సిద్దిపేట స్వచ్ఛత అని పాట పట్టణ ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చింది.. ఇది గొప్ప స్పూర్తిని ఇచ్చింది..దేశంలోనే సిద్దిపేట పట్టణం
పచ్చదనం పరిశుభ్రత లో ఎంత ఆదర్శంగా ఉందొ..ప్రజల భాగస్వామ్యం.. వారి చైతన్యం ఈ పాట ఈ అవార్డ్ రావడం లో ఎంతో తోడ్పాటు అయింది…

ఈనెల 20న ఢిల్లీ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొన్నున మున్సిపల్ చైర్మన్.. కమిషనర్..

స్వచ్ సర్వేక్షన్ లో సిద్దిపేట పట్టణం జాతీయ స్థాయిలో ఎంపిక కాగా ఈనెల ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో అవార్డ్ ల ప్రధానం ఉంటుందని.. రావాల్సిందిగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారిలకి సందేశం ద్వారా ఆహ్వానం అందింది.. ఈ మేరకు 20న విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇద్దరు అవార్డ్ ను సిద్దిపేట పుర ప్రజల పక్షాన అందుకొనున్నారు.

ప్రజల భాగస్వామ్యం.. ఐక్యత కు గొప్ప నిదర్శనం..

సిద్దిపేట పుర ప్రజలకు శుభాకాంక్షలు..

మంత్రి హరీష్ రావు

సిద్దిపేట పుర ప్రజల ఐక్యత.. వారి భాగస్వామ్యం గొప్పదని.. అభివృద్ధి ..అవార్డుల్లో వారు ఎంతో స్పూర్తిని చాటుకున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో అవార్డు కు ఎంపిక కావడం పట్ల సిద్దిపేట పుర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ అంశాల్లో దాదాపు 17 అవార్డులు సాదించామని, మరో అవార్డు ఇప్పుడు ఎంపిక కావడం ఇది ప్రజల భాగస్వామ్యం , ప్రజాప్రతినిధులు చొరవ అధికారుల అంకిత భావం అని ప్రశంసించారు. స్వచ్ సర్వేక్షన్ లో ఏ కార్యక్రమం చెప్పినా, పిలుపునిచ్చిన ప్రజలు ఎంతో చైతన్యాన్ని చూపారని కొనియాడారు. ఇదే స్ఫూర్తి తో పట్టణాన్ని మరింత అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలని మన అందరి కృషి ఫలితంగా మరిన్ని అవార్డులు సాధించాలన్నారు.

మంత్రి హరీష్ రావు స్పూర్తి.. ప్రజల చైతన్యం..

మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు.. కమిషనర్ ..

సిద్దిపేట లో అభివృద్ధిలో కార్యక్రమం చేయాలి అని కానీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన స్పూర్తి ఎంతో ఉందని, స్వచ్ సర్వేక్షన్ లో మంత్రి సూచనలు.. సలహాలు వారు ఇచ్చిన స్ఫూర్తి , ప్రజల భాగస్వామ్యం మున్సిపల్ అధికారులు పని తీరుకు నిదర్శనం అని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారి లు చెప్పారు..

సిద్దిపేట మునిసిపాలిటీకి 18 అవార్డులు..

2012 – క్లిన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు – రాష్ట్ర స్థాయి.

2015 – ఎక్సలెన్స్ అవార్డు ( సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ ) – జాతీయ స్థాయి

2016 – ఎక్స్ లెన్స్ అవార్డు పారిశుద్ధ్య నిర్వహణ – జాతీయ స్థాయి

2016 – హరిత మిత్ర అవార్డ్ రాష్ట్ర స్థాయి

2016 స్కాచ్ అవార్డు చెత్త సేకరణ, 100% మరుగుదొడ్ల నిర్మాణం లో జాతీయ స్థాయి అవార్డ్

2016 ఒడిఫ్ సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో …

2016 ఎక్స్ లెన్స్ అవార్డు రాష్ట్ర స్థాయిలో ..

2017 రాష్ట్రీయ స్వచ్ భారత్ పురస్కార్ జాతీయ స్థాయి

2017 బెస్ట్ మున్సిపాలిటీ అవార్డ్ సీఎం గారిచే రాష్ట్ర స్థాయి అవార్డు ..

2017 ఐఎస్ఒ అవార్డు జాతీయ స్థాయి

2018 – సాలీడ్ మేనేజ్మెంట్ లో స్కాచ్ అవార్డ్ జాతీయ స్థాయి

2018 స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు జాతీయ స్థాయి

2018 స్కోచ్ అవార్డ్ 6 పద్ధతులు అమలు లో ఉన్నందున జాతీయ స్థాయి

2018 స్వచ్ఛ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం..

2019 స్వచ్చత ఎక్స్ లెన్స్ అవార్డ్ జాతీయ స్థాయిలో

2019 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్ జాతీయ స్థాయిలో …( దక్షిణ భారత దేశంలో రెండవ స్థానంలో )

2021 సిద్దిపేట పట్టణం లో 100% ఇంటింటికి స్వచ్చ మైన త్రాగు నీటి సరఫరా నిర్వహణ కు రెండు స్కాచ్ అవార్డ్ లు వచ్చాయి.

2021 దేశ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు కు ఎంపిక…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News