Sunday, December 22, 2024

హిందూయిజంపై ఎస్‌పి నేత మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. 1955లో సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు.

ఒక జీవన విధానం అని చెప్పింది అని మౌర్య గుర్తుచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. మౌర్య హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగస్ట్టులో ఓ వీడియోను షేర్ చేశారు. హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మణిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం అని ఆ వీడియోలో పేర్కొన్నారు. రామచరిత్‌మానస్‌లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News