తిరుమల: శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ వారు తిరుపతిలో సోమవారం మీడియాతో మాట్లాడారు. టిటిడి అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి తాము అడిగిన దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదని తద్వారా మమ్మల్ని అవమానించారని ఆరోపించడం జరిగింది.
వాస్తవంగా సదరు స్వామీజీవారు 50 మందికి బ్రేక్ దర్శనం , 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం తో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టిటిడి అధికారులను కోరారు. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించడమయినది. అయితే సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆరోజున దర్శనం కోసం ఇంతమందికి ఇవ్వడం సాధ్యం కాదని 600 మంది సంఖ్యను తగ్గించాలని అదనపు ఇఒ కోరారు. అయితే సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జరిగింది. తాము అడిగినంతమందికి శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదనే కోపంతో మీడియా సమక్షంలో టిటిడి అధికారిని తీవ్రస్థాయిలో కించపరుస్తూ మాట్లాడం స్వామిజీగారి స్థాయికి తగదని తెలియజేయడం జరిగింది.