Wednesday, January 22, 2025

దేశ ప్రజల ఆహార కొరతను స్వామినాథన్ తీర్చారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్వామినాథన్ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిని స్వామినాథన్ ప్రశంసించారని, అన్నదాతల ఆత్మబంధువు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

స్వామినాథన్ మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం తెలిపారు. స్వామినాథన్ కృషి వల్లే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, స్వామినాథన్ మృతి వ్యవసాయరంగానికి తీరని లోటు అని పోచారం పేర్కొన్నారు.

స్వామినాథన్ మృతిపట్ల మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. దేశ ప్రజల ఆహార కొరతను స్వామినాథన్ తీర్చారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు.

జీవితాంతం వ్యవసాయ అభివృద్ధి గురించి స్వామినాథన్ ఆలోచించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. స్వామినాథన్ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News