Wednesday, January 22, 2025

యుపి పోల్స్ … స్వామి ప్రసాద్ మౌర్య పోటీ స్థానం మార్పు

- Advertisement -
- Advertisement -

పడ్‌రైవ్‌ను విడిచిపెట్టి ఫాజిల్ నగర్ నుంచి పోటీ

లక్నో : బిజెపి నుంచి ఇటీవలే సమాజ్‌వాది పార్టీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సిట్టింగ్ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధిష్ఠానం మార్చేసింది. ప్రతిసారీ స్వామిప్రసాద్ మౌర్య పడ్‌రౌవా నుంచి పోటీ చేస్తుండేవారు. ఈసారి మాత్రం పాజిల్ నగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆర్పీఎస్ సింగ్‌ను దృష్టిలో పెట్టుకునే సమాజ్‌వాది ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న మాట వినిపిస్తోంది. రాజకీయంగా ఫాజిల్ నగర్‌స్థానం అత్యంత బలీయమైన స్థానం. రాజకీయ సమీకరణాలను మార్చే నియోజక వర్గం ఇది. ఈ అంశాన్ని కూడా పరిగణన లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నియోజక వర్గం బీజేపీకి కంచుకోటగా ఉంటోంది. గత పదేళ్లుగా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థే గెలుపొందుతున్నారు. అయితే దీనికంటే ముందు సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఇది పెట్టని కోటలా ఉండేది. ఇక్కడ కుశ్వాహా ఓట్లతోపాటు ముస్లింల ఓట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. స్వామి ప్రసాద్ మౌర్య ఎప్పుడైతే బీజేపీని వీడి, సమాజ్‌వాది పార్టీలో చేరారో, అప్పుడే బీజేపీ ఖంగుతిన్నది. దీనికి ప్రతిచర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్‌ను బీజేపీలో చేర్చుకుంది. దీంతో పడ్‌రౌవ్ నియోజక వర్గం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ప్రజావ్యతిరేకత, ఎక్కడ తనపై పడుతోందో అన్న భయంతో కూడా స్వామి ప్రసాద్ మౌర్య ఈసారి పడ్‌రౌవ్‌ను వీడి, ఫాజిల్ నగర్ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు ఓ వర్గం పేర్కొంటోంది. మూడు లక్షల 50 వేలకు పైగా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. అందులో 10 శాతం బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు , 7 శాతం క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు, 8 శాతం వైశ్యుల ఓట్లు ఉన్నాయి. 14 శాతం ముస్లిం ఓట్లు, 5 శాతం యాదవులు, 10 శాతం కుశ్వాహ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News