Saturday, February 22, 2025

‘స్వప్నాల నావ…’కు అద్భుత స్పందన

- Advertisement -
- Advertisement -

మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు డా.వి.ఎన్.ఆదిత్య ఇటీవల ’స్వప్నాల నావ’ అనే యూట్యూబ్ మ్యూజిక్ వీడియో రూపొందించారు. డల్లాస్‌కి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు… శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ’స్వప్నాల నావ’ మ్యూజిక్ వీడియోని నిర్మించారు. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నటించడం కూడా విశేషం. ఇక ఈ ’స్వప్నాల నావ’ థీమ్ విషయానికి వస్తే, చదువులో ఒకసారి ఫెయిలయిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రేరణగా నిలిచే పాట ఇది.

దివంగత స్టార్ లిరిసిస్ట్ అయినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దీనిని మలిచారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ ఆలూరు ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. శ్రీ క్రియేటివ్స్ యూ.ఎస్.ఏ. యూట్యూబ్ ఛానల్‌లో రిలీజైన ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ (పది లక్షల వ్యూస్) నమోదయ్యాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి దీనికి సమర్పకురాలుగా వ్యవహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News