Friday, February 21, 2025

‘ఛావా’ని అలా పోలుస్తూ.. నటి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో రాజు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఛావా సినిమాను కుంభమేళా మరణాలతో పోలుస్తూ ఆమె ట్వీట్ చేశారు. ‘ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం జరిగిన కథని స్వల్పంగా కల్పితం చేసి చూపించే సినిమాలోని హింస దృశ్యాలకు స్పందిస్తున్న సమాజం.. కుంభమేళాలో తొక్కిసలాట, నిర్వహణ లోపం కారణంగా జరిగిన మరణాలను, ఆ తర్వాత ఆ శవాలను జెసిబిలతో ఎత్తివేయడాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. బ్రెయిడ్ డెడ్ సొసైటీ’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనిపై కొందరు ఆమెకు మద్ధతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News