Wednesday, January 22, 2025

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్వరా భాస్కర్

- Advertisement -
- Advertisement -

ఉజ్జయిన్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో గురువారం నటి స్వరా భాస్కర్ పాల్గొంది. రాహుల్ గాంధీ, స్వరా భాస్కర్ కలిసి నడిచిన ఫోటోలను నేషనల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. స్వరా భాస్కర్ అనేక అంశాలపై చాలా ధైర్యంగా అభిప్రాయాలు వెల్లిబుచ్చుతుంటారు. ఇదివరలో సినీ ప్రముఖులు అమెల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజా భట్, రియాసేన్, సుశాంత్ సింగ్, మోనా అంబేగోంకర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష వంటి వారు కూడా రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు హాలీవుడ్ నటుడు జాన్ కుసక్ కూడా ఇదివరలో ట్విట్టర్ ద్వారా తన మద్దతును తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News