Wednesday, January 22, 2025

ముసలితనం మీద పడుతున్నదా..స్వర్ణభస్మం పరమౌషధం

- Advertisement -
- Advertisement -

బంగారు చూరు లేదా స్వర్ణభస్మం మనిషికి ముసలితనం లేకుండా చేయడంలో ఉపకరిస్తుంది. సాధారణంగా భారతీయ ప్రాచీన ఔషధాలలో , మూలికలలో తరాల నుంచి కూడా ఈ స్వర్ణభస్మాన్ని వాడుతారు. చాలాకాలంగా చర్మం రక్షణకు, మచ్చలు లేకుండా చేసేందుకు దీనిని వాడుతారు. కొన్ని కుటుంబాలలో దీనిని ఓ మోతాదులో భోజనానంతర తాంబూలంలో వాడటం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్వర్ణభస్మం వయస్సు మీదపడకుండా చేస్తుందనే విషయాన్ని నిపుణులు నిర్థారించారు. సమీకృత వైద్య సంఘం (ఆయూష్) జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్‌పి పరాషెర్ ఈ విషయాన్ని శుక్రవారం నిర్థారించారు. కాగా బంగారం చూరు చేసి తీసే పదార్థం తీసుకోవడం వల్ల చర్మంలో అది తేలిగ్గా లీనం అయిపోతుంది. ఇక ఈ బంగారపు రేణువులకు ఉండే సహజసిద్ధమైన మూలక ధర్మం వల్ల చర్మం నిగనిగలాడటమే కాకుండా ఓ పట్టానా ముసలితనం రాకుండా చేస్తుందని నిర్థారణ అయింది.

సోనా భాష్మా అనబడే ఈ పదార్థం పలు ఆయుర్వేద మందులలో మూలకంగా ఉంది. మానవ శరీరంలోని పలు కీలక ప్రక్రియలు, వ్యవస్థలను పునరుత్తేజితం చేసేందుకు దీనితోని లక్షణాలు ఉపకరిస్తాయని ఆర్‌పి తెలిపారు.బంగారం కేవలం మనిషి శరీరం పైపై తళుక్కులకు ఉపయోగపడే నగలలో వాడేందుకే కాకుండా , ఇది అంతర్గత ఆరోగ్యశక్తిని కాపాడుతుందని కూడా నిపుణులు విశ్లేషించారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో బంగారం ప్రయోజనాలను వేలాది సంవత్సరాల క్రితమే గుర్తించారు. కాగా తొందరగా ముసలివాళ్లం అవుతున్నామనే భయాందోళను రగులుకుంటున్న మనిషికి ఈ బంగారం ఆరోగ్య రహస్యం మరింతగా ఉపయోగపడుతుంది. అయితే బాగా డబ్బులు పెట్టగలిగితే కానీ బంగారం చూరును ఔషధంగా తీసుకోవడం వీలుకాదనేది కీలక విషయం. కణజాలం కుంచించుకుని పోకుండా చేయడానికి అవసరం అయిన మౌలిక మూల కణాల ధర్మపు లక్షణాలు బంగారంలో ఉంటాయి. కణజాల పునరుత్పత్తికి ఇది దోహదం చేస్తుంది. కాగా జీర్ణశక్తి, శారీరక అంతర్గత ప్రక్రియ ప్రత్యేకించి యవ్వనశక్తిని పెంచేందుకు ఇది దోహదం చేస్తుంది. కండరాల నొప్పుల నివారణకు , ఎముకలు, నాడుల బలానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇప్పటి యువతరం బాగా సంపాదించే స్థాయిని చేరుకుంటున్న దశలో యంగ్‌గా ఉండే తాపత్రయంతో ఇతరత్రా మార్గాలకు వెళ్లకుండా ఇప్పుడు ఎక్కువగా బంగారం చూరును తీసుకోవడం జరుగుతోందని అయిమిల్ ఆయోయుత్వేద డైరెక్టర్ డాక్టర్ సంచిత్ శర్మ కూడా తెలిపారు. భారతీయ పరిశోధకుల సాయంతో ఈ సంస్థ తళతళమెరిసే గోల్డ్ ఫేస్ క్రీం కూడా రూపొందించింది. 24 క్యారట్ గోల్డ్ కణాలను, కశ్మీరీ కుంకుమతో రంగరించి రూపొందించిన మిశ్రమంతో ఈ క్రీం రూపొందింది. ఇందులో పలు రకాల ఆరోగ్యకర సుగంధ ద్రవ్యాల మిళితం కూడా ఉంటోంది. బంగారం ఔషధంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అవకాశం లేదని, పైగా ఇది నేరుగా కణజాలంలోకి చేరుకుని తన ప్రయోజనకర ఫలితాలను అందచేస్తుందని నిపుణులు తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News