హైదరాబాద్: తనకు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని జోగిని స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమంలో భాగంగా జోగిని స్వర్ణలత తన భవిష్యవాణి వినిపించారు. సంతోషంగా పూజలు చేయడం లేదన్నారు. ప్రతి సంవత్సరం చెప్తున్నా పట్టించుకోవడంలేదని, తాను సంతోషంగా లేకపోయినా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూస్తున్నానన్నారు. తనకు గర్భగుడిలో శ్రాస్త్రోకంగా పూజలు నిర్వహించాలని కోరారు. ప్రతి సంవత్సరం తనకు ఆటంకమే కల్గిస్తున్నారని, తన బిడ్డలే అని సరి పెట్టుకుంటున్నానని, భక్తుల కళ్లు తెరిపించేందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నామని, భక్తులు తప్పు చేసినా… మిమ్మల్ని కాపాడుతూ వచ్చానని వివరించారు. ప్రజలందరూ తనని కనులారా వీక్షించుకునేలా పూజలు జరిపించాలన్నారు. భక్తులు కంటతడి పెట్టుకుండా ఉండేలా చూస్తానన్నారు. కాసేపట్లో అమ్మవారిని అంబారీపై ఊరేగించనున్నారు. తనని ఎన్ని రూపాలుగా మరుస్తారురా? అని ప్రశ్నించారు. నా రూపంలోనే నేను పూజలు అందుకోవాలని అనుకుంటున్నానని, మీరు నాకు పెట్టేది ఏముందని, అంతా దోచేస్తున్నారు కదా? అని అడిగారు.