Thursday, January 23, 2025

యాదాద్రిని సందర్శించనున్న శారదా పీఠాధిపతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పునఃనిర్మాణం తర్వాత తొలిసారి నారసింహ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏప్రిల్ 12వ తేదీన యాదగిరిగుట్టకు విచ్చేసి నారసింహునికి విశేష పూజలు నిర్వహించనున్నారు. స్వరూపానందేంద్ర యాదాద్రి వచ్చి ఐదేళ్ళవుతోంది. మహా సంప్రోక్షణ తర్వాత యాదాద్రిని సందర్శిస్తున్న తొలి పీఠాధిపతిఈయనే కావడం విశేషం. దేశవ్యాప్తంగా సుప్రసిద్ధ కట్టడాల్లో ఒకటిగా నిలిచిన యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి క్షేత్రాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ శైలిని పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామి తన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రతో, విశాఖ శారదాపీఠం భక్తులతో కలిసి విశాఖ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి, గంట వ్యవధిలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్ట వెళతారు. స్వరూపానందేంద్ర రాకకి అవసరమైన తగు భద్రతా ఏర్పాట్లను, ఆతిధ్య ఏర్పాట్లనూ చేపట్టామని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News