Wednesday, April 2, 2025

స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న సిఎస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలిశారు. శనివారం పీఠాధిపతుల ఆశీస్సులు ఆమె అందుకున్నారు. రాజశ్యామలా అమ్మవారి శేష వస్త్రాలను స్వరూపానందేంద్ర శాంతికుమారికి అందజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం అనంతరం పీఠాధిపతులు చందానగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ సముదాయానికి వచ్చారు. సిఎస్ శాంతికుమారితో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు దంపతులు స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు.

Shanti Kumari 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News