Wednesday, January 22, 2025

స్వాతంత్య్రోద్యమం-తెలుగు సినిమా ప్రముఖులు పుస్తకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన ‘స్వాతంత్రోద్యమం తెలుగు సినిమా- ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం హైదరాబాద్‌లో అతిరధ మహారధుల సమక్షంలో శనివా రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని విడుదల చేసి మాట్లాడుతూ-“ తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉన్న ది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్ కిశోర్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించిన చక్కటి విశ్లేషణ చేశాడు. ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఇక గూగుల్‌ను రిపేర్ చేయాలన్నా గురువే కావాలి.

ఇటువంటి మంచి పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావటానికి సంజయ్ కిశోర్‌ని ప్రయత్నించమని కోరుతున్నా”అని అన్నారు. పుస్తక రచయిత సంజయ్ కిశోర్ మాట్లాడుతూ- “ఒక సందర్భంలో కె.వి రమణాచారిని కలిసినప్పుడు స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమం చేస్తోంది. నువ్వు కూడా ఏదన్నా చెయ్యి సంజయ్ అని నాలుగు మంచి మాటలు చెప్పారు.

నాకు సినిమాపై నాలెడ్జ్ ఉండటంతో ఆరునెలల్లో స్వాతంత్య్రంలో పాల్గొన్న మన సినిమా పెద్దల గురించి రాద్దామని అనుకుని ఈ పుస్తక ప్రయాణం మొదలు పెట్టాను. దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం పట్టింది పుస్తకాన్ని తీసుకురావటానికి. ఇంతమంచి పుస్తకం వెంకయ్యనాయుడు చేతులమీదుగా విడుదలవ్వటం నాకు ఎంతో ఆనందంగా ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా కె.వి.రమణాచారి, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ గాయణిమణులు, సినిమా పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News