Sunday, December 22, 2024

ఇల్లు కబ్జా చేసేందుకు యత్నించిన సినీ నటి స్వాతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఇల్లును కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సినీ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు మరికొందరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇంటి విలువ దాదాపుగా రూ.30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అమెరికాలో ఉండే మాధురికి జూబ్లీహిల్స్‌లో రోడ్డు నంబర్ 58లో 1100 గజాల స్థలంలో ఇల్లు ఉంది. మొదటి అంతస్తులో ఆమె బంధువులు నివాసం ఉండగా కింద ఫ్లోర్‌లో కాఫీ షాప్ నిర్వహిస్తామని సినీ నటి స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్ అమెరికాలో ఉన్న మాధురిని కలిశారు. లీజ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు ఒప్పుకున్నప్పటి అనివార్య కారణాల వల్ల చేసుకోలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఈ నెల 20న స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్ కలిసి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు. మెయిన్ గేట్ ధ్వంసం చేస్తుండగా అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ ఆపేందుకు ప్రయత్నించగా అతడిని వారు బెదిరించారు. దీంతో వారిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News