Sunday, December 22, 2024

అదే ‘స్వాతిముత్యం’లో అందరికీ బాగా నచ్చింది

- Advertisement -
- Advertisement -

'Swathi Muthyam' Movie Success Meet

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి రూపొందించిన చిత్రం ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా విజయోత్సవ వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. “సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి చాలా సహజంగా మన మధ్యలో జరిగినట్లు ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు? అనే దాని మీదే ఈ సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది” అని అన్నారు. నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “స్వాతి ముత్యం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మా సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్, వర్ష బొల్లమ్మ, దివ్య శ్రీపాద, సురేఖా వాణి తదితరులు పాల్గొన్నారు.

‘Swathi Muthyam’ Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News