Sunday, December 22, 2024

ఆకట్టుకుంటున్న ‘స్వాతి ముత్యం’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

Swathi Muthyam Movie Trailer Released

గణేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిత్ర ట్రైలర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్, వర్ష బొల్లమ్మ, నిర్మాత నాగ వంశీ, దర్శకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ “ఈ కథ అంగీకరించినందుకు గణేష్‌కి బిగ్ థాంక్స్. ఈ సినిమా రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదు. సినిమాలో కొత్త పాయింట్ ఉంది. చిన్న టౌన్‌లో ఒక అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు పెళ్లి చేసే విధానం, ఆ సందర్భంగా అబ్బాయికి వచ్చే సమస్యలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమాలో గణేష్ చాలా బాగా చేశాడు. ఈ కథ రాస్తున్నప్పుడే హీరోయిన్‌గా వర్ష బాగుంటుందని అనుకున్నాను. ఇంకా ఈ సినిమాలో నటించిన రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, ప్రగతి, సురేఖా వాణి, వెన్నెల కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు”అని అన్నారు. గణేష్ మాట్లాడుతూ “ఈ కథ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి సితార దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. ఇంత భారీ తారాగణంతో సినిమా అద్భుతంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే దానికి ప్రధాన కారణం వంశీ. ఆయనకు నా కృతఙ్ఞతలు. ట్రైలర్‌లో చూసినట్టుగానే ఈ సినిమా చాలా సరదాగా.. మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో జరిగే కథ లాగా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ష బొల్లమ్మ పాల్గొన్నారు.

Swathi Muthyam Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News