Sunday, December 22, 2024

ఆద్యంతం వినోదం

- Advertisement -
- Advertisement -

గణేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం చిత్ర కథానాయకుడు గణేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్ ట్రైలర్ పేరుతో ఓ సంక్షిప్త ప్రచార చిత్రంను విడుదల చేసింది చిత్ర బృందం. దాదాపు నలభై క్షణాల పాటు సాగే ఈ దృశ్య మాలిక ఆద్యంతం సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదల అన్న ప్రకటనతో పాటు, దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు ‘స్వాతిముత్యం’ను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు.

Swathi Muthyam teaser trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News