Tuesday, December 31, 2024

మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న ‘స్వాతి రెడ్డి…’ సాంగ్..

- Advertisement -
- Advertisement -

’మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.’లడ్డు గాని పెళ్లి’ అంటూ ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి గీతంకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతంగా ’స్వాతి రెడ్డి’ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ’లడ్డు గాని పెళ్లి’ తరహాలోనే విన్న వెంటనే కట్టిపడేసేలా ఎంతో ఉత్సహంగా ఈ గీతం సాగింది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ల త్రయం మరోసారి నవ్వించడానికి వస్తున్నారు. మొదటి భాగానికి మించిన వినోదాన్ని పంచడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు. అదే ఉత్సాహం తాజాగా విడుదలైన రెండవ గీతంలోనూ కనిపించింది. ఇక ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై శ్రీకర స్టూడియోస్ తో కలిసి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఫిబ్రవరి 26, 2025న థియేటర్లలో అడుగు పెట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News